ఓదెల మండలంలోని గోపురపల్లి కొలనూరు గ్రామాలను శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ తీరును పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఈనెల 25 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో 100% టాక్స్ కలెక్షన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్ పాష, కార్యదర్షులు శ్రీనివాస్, నాగరాజులు పాల్గొన్నారు.