పెద్దపల్లి: పేదలకు అండగా కళ్యాణ లక్ష్మి: ఎమ్మెల్యే

75చూసినవారు
పెద్దపల్లి: పేదలకు అండగా కళ్యాణ లక్ష్మి: ఎమ్మెల్యే
కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం పేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శనివారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 15 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 15, 01, 740 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్