సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరాకు ఆన్ లైన్ బుకింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. నీరుకుల్ల, గట్టెపల్లి ఇసుక రీచ్ ల నుండి సాండ్ టాక్సీ- మన ఇసుక వాహనం విధానాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు, ఓదెల మండలాల ప్రజలకు సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.