జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పెద్దపల్లిలో మంగళవారం టియుడబ్లుజె- ఐజెయు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇండ్లు, స్థలాలు మంజూరు చేయాలని, పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని కోరారు.