సింగరేణి వ్యాప్తంగా ఈనెల 9 నుండి 21 వరకు నిర్వహిస్తున్న 55వ వార్షిక భద్రత పక్షోత్సవాలను పురస్కరించుకొని రామగుండం-3 ఏరియాలోని ఓసిపి-2 ఉపరితల గనిలో భద్రతా తనిఖీ బృందం కన్వీనర్ డెబ్దులాల్ బైద్య పర్యటించారు. ఉద్యోగుల భద్రతపై ఏమాత్రం అశ్రద్ద వహించరాదని, అనుక్షణం అప్రమత్తతో ఉంటూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించుకోవాలన్నారు. ఆర్జీ-3 జీఎం సుధాకరరావు, రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎం కెహెచ్ఎన్ గుప్తాలు పాల్గొన్నారు.