వేములవాడ రాజన్నను దర్శించుకున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్

52చూసినవారు
వేములవాడ రాజన్నను దర్శించుకున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజన్న దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మేడ లక్ష్మీనర్సింహా రావు, మున్సిపల్ ఛైర్మన్ మాధవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్