రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో సోమవారం వేకువ జామున రోడ్డుపైనే కూరగాయలు జరుగుతున్నాయి. అయితే వచ్చిపోయే భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు వెచ్చించి కూరగాయల మార్కెట్ నిర్మించిన సంబంధిత అధికారులు కూరగాయల మార్కెట్ వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేయకపోవడం శోచనీయం. ప్రమాదాలు జరిగితే ఎవరూ బాధ్యులనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.