రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ప్రత్యేకమైన కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు. నెంబర్ ప్లేట్ ఫస్ట్.. జరిమానాలు నెక్స్ట్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో వేములవాడ ప్రధాన కూడళ్లలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ చేస్తున్నారు.