జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా ధోని
జార్ఖండ్ లో జరగనున్న ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నియమితులయ్యారు. ధోని తన ఫోటోను అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించేందుకు ఎన్నికల కమిషన్కు సమ్మతి తెలిపినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె. రవికుమార్ తెలిపారు. తన ఫోటోను ఉపయోగించుకోవడానికి ధోని సమ్మతి తెలిపినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ధోని తమతో కలిసి ఓటర్ల సమీకరణకు కృషి చేస్తారని కుమార్ పేర్కొన్నారు.