కోరుట్ల
మెట్ పల్లి: ఉత్తమ యువ రైతుగా ఆరె రమేష్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని వేములకుర్తి గ్రామానికి చెందిన అరె రమేష్ మంగళవారం ఉత్తమ యువ రైతుగా అవార్డును అందుకున్నారు. ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా స్రవంతి నృత్య కళానికేతన్ సేవా సంస్థ, సృజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సద్భావన పురస్కార అవార్డుల సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు అందే మారుతి బాపూజీ, తదితరులు పాల్గొన్నారు.