SLBC టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 44 రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు కేవలం ఇద్దరి మృతదేహాలే బయటపడ్డాయి. ఇంకా ఆరు మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో 30 మీటర్లు డేంజర్ జోన్‌గా గుర్తించడంతో, రెస్క్యూ టీమ్ సభ్యులు అప్రమత్తంగా లోపలికి ప్రవేశిస్తున్నారు. సహాయక చర్యలపై ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.