మద్యానికి డబ్బులివ్వలేదని.. కన్నతల్లిని చంపిన కుమారుడు

51చూసినవారు
మద్యానికి డబ్బులివ్వలేదని.. కన్నతల్లిని చంపిన కుమారుడు
తెలంగాణలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కొడుకు కడతేర్చిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో చోటుచేసుకుంది. గుర్రాలదండి కొత్తతండాకు చెందిన మోజి, రాములు దంపతుల కుమారుడు శ్రీను భార్యతో కలిసి చేవెళ్లలో నివాసం ఉంటున్నాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ తన తల్లితో గొడవ పెట్టుకుకుని క్షణికావేశంలో శ్రీను, తల్లి మోజి తలపై కర్రతో బలంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్