కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ ప్రమాణస్వీకారం

62చూసినవారు
కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ ప్రమాణస్వీకారం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో శాస‌న స‌భ్యుడిగా ప్రమాణ చేశారు. శ్రీగణేష్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్