రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి

75చూసినవారు
రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి
TG: వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత తెలుసుకుని అధికారులు పనిచేయాలని హితవు పలికారు. రైతులు, ప్రజా ప్రతినిధులు, మంత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు. పరిష్కారంలో జాప్యంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్