మహిళను వేధించిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలి

56చూసినవారు
మహిళను వేధించిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలి
యూపీ రాజధాని లక్నోలో వరద నీటిలో బైక్‌పై వెళుతున్న మహిళను పోకిరీలు వేధించిన ఘటనపై ఎస్పీ ఎంపీ డింపుల్‌ యాదవ్ స్పందించారు. యూపీలో మహిళలపై పెచ్చుమీరిన ఆగడాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన డింపుల్‌ యాదవ్‌ నిందితులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మహిళను వేధిస్తున్న వీడియోలు, రికార్డింగ్‌లు వెలుగుచూశాయని, ఈ పని ఎవరు చేశారనేది ప్రభుత్వం సులభంగా గుర్తించవచ్చని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్