ఏపీలోని అన్నమయ్య జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. వీరబల్లి మండలంలోని పుల్లగూర గండిలో ప్రమాదవశాత్తు నీటిలో పడి అద్నాన్ (14) అనే పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. సెలవు రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన అద్నాన్ మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు రాయచోటి పట్టణంలోని నాయబసాబ్ వీధికి చెందిన టైలర్ షకిల్ కుమారుడిగా గుర్తించారు.