అధికారుల కోసం పడిగాపులు

54చూసినవారు
అధికారుల కోసం పడిగాపులు
ప్రభుత్వ కార్యాలయంలో పని అంటేనే ప్రజలు భయపడుతున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, వైద్య, ఆరోగ్య శాఖ. ఇలా ప్రభుత్వ కార్యాలయాలకు నిత్యం వేలాది మంది ప్రజలు తమ సొంత పనులపై వస్తుంటారు. అధికారులు సమయపాలన పాటించకపోవడం వల్ల ప్రజలు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. పని చిన్నదైనా రోజంతా పడిగాపులు కాచే సందర్భాలు కోకొల్లలు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కష్టాలను మాటల్లో చెప్పలేం. అక్షరాల్లో వర్ణించలేం.

సంబంధిత పోస్ట్