ఓయూలో విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. సెంటినరీ లేడీస్ హాస్టల్‌లో నీళ్లు రావడంలేదంటూ నిరసనకు దిగారు. గత మూడు రోజులుగా హాస్టల్‌లో ఇబ్బందిగా ఉందని.. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. వేసవి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, సెంటినరీ హాస్టల్ డైరెక్టర్ లక్ష్మి, సూపరింటెండెంట్ పద్మ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.