భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

67చూసినవారు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. చౌటుప్పల్ మండలం కైతపురం గ్రామ జాతీయ రహదారిపై లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆదివారం డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే హైవేపై లారీ బోల్తాకొట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్