విద్యార్థులు మత్తు పదార్ధాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి కోరారు. ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని గుడిబండ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్ధాలు, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని విద్య, విజ్ఞానం కోసం ఉపయోగించుకోవాలని సీఐ రజితారెడ్డి కోరారు. ఇంటర్నెట్ వినియోగించే సమయంలో తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దన్నారు.