అనారోగ్య బాధితునికి నిత్యావసరాలు అందజేత

77చూసినవారు
అనారోగ్య బాధితునికి నిత్యావసరాలు అందజేత
కోదాడ మండలం చిమిర్యాల వాసి శ్రీనివాస్ ఒక ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తూ, ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ తో తీవ్ర అనారోగ్యానికి గురి అయిన విషయాన్ని తెలుసుకున్న ఎం ఎస్ విద్యా సంస్థల సీఈవో ఎస్ ఎస్ రావు సహృదయంతో స్పందించి ఒక నెల సరిపడ నిత్యావసర సరుకులు గురువారం శ్రీ లక్ష్మీ వాసు కిరాణా షాపులో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్ రావు మాట్లాడుతూ, నిజమైన బాధితులకు అండగా ఉంటానని అన్నారు.

సంబంధిత పోస్ట్