నల్గొండ: ఆ ఇళ్లను కూల్చం: హైడ్రా

62చూసినవారు
హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. గతంలో అనుమతులు తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న వాటి వైపు వెళ్లమన్నారు. జూలై తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని కూల్చేస్తామన్నారు. అలాగే ఇటివల తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీ చేస్తుందని, లోపాలు ఉంటే అడ్డుకుంటామని తెలిపారు. పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్ర వెళ్లదన్నారు.

సంబంధిత పోస్ట్