మునుగోడు మండలం ఎల్గలగూడెం గ్రామ సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తల్లి నెల్లికంటి పార్వతమ్మ(85) గత ఐదు రోజుల క్రితం మరణించగా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ ఆదివారం పార్వతమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తీర్పారి వెంకటేశ్వర్లు , కట్కూరి లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.