సాగర్ కాలువలో పడి ఇద్దరు గల్లంతు

79చూసినవారు
సాగర్ కాలువలో పడి ఇద్దరు గల్లంతు
నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. త్రిపురానానికి చెందిన సాయి (25), శైలజ (30) బట్టలు ఉతకడానికి సమీపంలోని ఎడమ కాల్వకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు శైలజ, సాయి పడిపోయారు. గమనించిన వారు కాపాడే ప్రయత్నం చేసిన నీటి ప్రవాహనికి కొట్టుకుపోయారు. నీటి ఉధృతి అధికంగా ఉండడంతో వారు పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు కొట్టుకురావచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్