సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు గల్లంతు

62చూసినవారు
సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు గల్లంతు
నిడమనూరు మండల పరిధిలోని బొక్క మంతలపహాడ్ గ్రామ సమీపంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువలో బుధవారం సాయంత్రం బట్టలు ఉతకడానికి వెళ్లిన త్రిపురారం గ్రామానికి చెందిన సాయి, శైలజ, రమాదేవి అనే ముగ్గురు ప్రమాదవశాత్తు జారీ కాల్వలో పడి పోయారు. ఇందులో రమాదేవిని అక్కడే ఉన్న స్థానికులు కాపాడగా, సాయి, శైలజలు గల్లంతయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్