కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దుచేసి ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలని, సెప్టెంబర్ 28న కలెక్టరేట్ ముందు 30న హైదరాబాద్ లేబర్ కమిషనరేట్ ముందు జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర కమిటీ మేరకు నల్లగొండ పట్టణంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సర్వే నిర్వహించారు.