సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట్ నరసింహ రెడ్డి భవన్ లో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.