సూర్యాపేట పట్టణంలోని బొడ్రాయి బజార్ నందు గల వేదాంత భజన మందిరం నందు శనివారం ప్రముఖ వ్యాపారవేత్త చల్లా లక్ష్మికాంత్ ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవిలకు నైవేద్యంగా వెన్నను సమర్పించే కుడారై మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా లక్ష్మికాంత్ శృతి దంపతులు ఆలయంలో జరిగిన పూజలో పాల్గొని 108 కుడారై పాయసములను భక్తులకు అందజేశారు.