కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరుతాయని 4వ వార్డు కౌన్సిలర్ జాటోతు లక్ష్మీ మకట్ లాల్, వార్డు ఇన్చార్జ్ ధరావత్ నాగు నాయక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం 4వ వార్డు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులకు, అర్హత కలిగిన వారికి తప్పకుండా చేరుతాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు.