సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారానికి 23వ రోజుకు చేరింది. ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకుని పూజ నిర్వహిస్తున్నారు. వివిధ రూపాలలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రాము అయ్యగారు భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.