తెలంగాణలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా మార్చుతున్న నేపథ్యంలో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు. ఇండస్ట్రీకి అవసరమైన రీతిలో ఏటీసీల్లో సిలబస్ మార్పునకు ఉన్నతస్థాయి కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలతో పాటు స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని చెప్పారు.