మిల్క్ బ్యూటీ తమన్నా తాజాగా ఓ సందేశాత్మక పోస్ట్ షేర్ చేశారు. 'జీవితంలో అద్భుతాలు జరగాలని ఎదురుచూడొద్దు. దాని బదులు మనమే అద్భుతాన్ని సృష్టించాలి' అని అన్నారు. దీంతో పాటు ఆమె తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఫొటోలను షేర్ చేశారు. విజయ్ వర్మతో ఆమె రిలేషన్ ముగిసిందనే వార్తల నేపథ్యంలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిని ఆమె బ్రేకప్‌ను అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నంగా భావిస్తున్నారు.