తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన రద్దయింది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటన రద్దు చేసినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఆదివారం ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేయనున్నది. రేపు ఉదయం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌తో కేసీ వేణుగోపాల్ ఫోన్‌లో మాట్లాడనున్నట్లు సమాచారం.