గ్రామీణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లకు టోల్ టాక్స్ విధించేందుకు సిద్ధమవుతోంది. హైబ్రిడ్ అన్యుటి మోడల్ పేరుతో 2028 నాటికి 17,000 కి.మీ. రోడ్లను రూ.28,000 కోట్లతో అభివృద్ధి చేయనుంది. ఇందులో 40% రాష్ట్ర ప్రభుత్వ నిధులు, 60% ప్రైవేట్ పెట్టుబడితో రోడ్లను అభివృద్ధి చేయనుంది. నేషనల్ హైవే తరహాలో గ్రామీణ, మండల రోడ్లలో టోల్ వసూలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.