ఈ నెల 11 నుంచి 14 వరకు తెలంగాణ రైతు మహోత్సవం

74చూసినవారు
ఈ నెల 11 నుంచి 14 వరకు తెలంగాణ రైతు మహోత్సవం
TG: ఈ నెల 11 నుంచి 14 వరకు తెలంగాణ రైతు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి తెలిపారు. వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్దక, ఆక్వా, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రైతు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అగ్రి కల్చర్​ సొసైటీ.. నాంపల్లి ఎగ్జిబిషన్​ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్