సెక్రటరియేట్ లో కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందేలా చూడాలని ఆదేశించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామ సభ నిర్ణయాలే కీలకమని చెప్పారు. గ్రామసభలో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో నివృత్తి చేయాలన్నారు. పాత రేషన్ కార్డులు తొలగిస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.