బానెట్‌పై వ్యక్తితో కారు డ్రైవ్‌ చేసిన బాలుడు.. చివరికి(వీడియో)

65చూసినవారు
కారు బానెట్‌పై ఓ వ్యక్తి ఉండగా ఒక బాలుడు దానిని డ్రైవ్‌ చేయడం చర్చనీయాంశం అయింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. బీఎండబ్ల్యూ కారు బానెట్‌పై ఒక వ్యక్తి ప్రమాదకరంగా పడుకొని ఉండగా ఓ 17 ఏళ్ల యువకుడు దానిని నడిపాడు. ఇది చూసి స్థానికులు షాక్‌ అయ్యారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ముంబై పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. బానెట్‌పై పడుకున్న వ్యక్తిని, కారు యజమానిని అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్