గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల గుర్తింపు, వారికి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకోసం ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని వర్కర్లకు సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల కోసం 2025-26 బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు, వారికి గుర్తింపు కార్డుల జారీ, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.