డ్రైవర్ లేకుండానే నడవనున్న మెట్రో రైలు.. ఎక్కడంటే

74చూసినవారు
డ్రైవర్ లేకుండానే నడవనున్న మెట్రో రైలు.. ఎక్కడంటే
దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్ లేకుండానే మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. అక్కడి మెజెంటా లైన్ మార్గంలో డ్రైవర్ లెస్ మెట్రో రైలు నడవనుంది. జూలై 1 నుండి ఇది ప్రారంభం కానుందని డీఎంఆర్సీ (DMRC) తెలిపింది. డ్రైవర్‌లెస్ మెట్రో 2020 సంవత్సరంలో మెజెంటా లైన్‌లో దశలవారీగా ప్రారంభించారు. ఈ మెట్రో రెండు కెమెరాల సహాయంతో నడువనుంది. ఇది కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించబడుతుంది. ఒక కెమెరా మెట్రో ట్రాక్‌పై నిఘా ఉంచగా, మరో కెమెరా ఓవర్‌హెడ్ కేబుల్‌పై నిఘా ఉంచుతుంది.

సంబంధిత పోస్ట్