AP: బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇవాళ ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైసీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెట్టింది’ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.