ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకొనేందుకు ముస్లింలందరూ సన్నాహాలు చేసుకుంటుంటే గాజాలోని చిన్నారులు మాత్రం, తమ నుంచి పండుగ సంతోషాన్ని లాగేసుకున్నారంటూ బాధపడుతున్నారు. రంజాన్ ముగింపును సూచించే ఈద్ ఉల్ ఫితర్ పండుగను యుద్ధం కారణంగా జరుపుకోలేకపోతున్నారు. గాజా స్ట్రిప్‌లో యుద్ధం కారణంగా కనీసం 17 వేల మంది పిల్లలు, తల్లిదండ్రులు లేకుండానో, లేదంటే వారి నుంచి దూరమై జీవిస్తున్నారని యూనిసెఫ్ తెలిపింది.