TG: కంచ గచ్చిబౌలి భూములపై డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేలకోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వానికి దక్కేలా చేశామని, ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన గొప్ప విజయమన్నారు. యూనివర్సిటీకి సంబంధించి ఇంచు భూమి కూడా తీసుకోమని, ఆ భూమికి సంబంధించి పంచనామాతో కూడిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. యువతకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వస్తాయనే ఆ భూములను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.