ప్రతినెలా ఆదాయం తెచ్చిపెట్టే స్కీమ్ ఇదే!

23716చూసినవారు
ప్రతినెలా ఆదాయం తెచ్చిపెట్టే స్కీమ్ ఇదే!
భవిష్యత్ లో ఏర్పడబోయే ఆర్థిక అవసరాలకు బెంగ కలగకుండా
అయితే కేంద్ర ప్రభుత్వం ఓ చక్కటి స్కీమ్ లో అందుబాటులో ఉంచింది. ఈ పథకంలో చేరి పొదుపు చేస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా డబ్బులు వస్తాయి. అసంఘటిత రంగంలోని వారు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం 2015 నుంచి అమలు చేస్తోంది.

18 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హులు. బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఈ పథకంలో చేరిన వారు ప్రతి నెలా కొంత మొత్తం ప్రీమియం రూపంలో చెల్లించాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా డబ్బులు అందజేస్తారు. రూ.5 వేల వరకు పొందొచ్చు.

ఈ పథకంలో చేరడం వల్ల నెలకు కనీసం రూ.1000, ఆపై రూ.2 వేలు, రూ.3 వేలు, రూ.4 వేలు, రూ.5 వేలు చొప్పున కూడా పెన్షన్ పొందే వెసులుబాటు ఉంటుంది. ప్రతి నెలా రూ.5 వేలు పెన్షన్ పొందాలని భావిస్తే గనుక మీరు ప్రతి నెల రూ.210 చెల్లించాలి. వయసు పెరిగే కొద్ది చెల్లించాల్సిన నెలవారీ మొత్తం కూడా పెరుగుతుంది. ఈ స్కీమ్ గురించి కొంత వరకు తెలిసినా చాలా మంది ఇంకా ఇందులో చేరలేదు. మన స్నేహితులు, బంధువులకు ఈ విషయం చెరవేయడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించుకునే అవకాశం ఉంటుంది.

సంబంధిత పోస్ట్