పుట్ట గొడుగులు తిని ముగ్గురు చిన్నారుల మృతి

69చూసినవారు
పుట్ట గొడుగులు తిని ముగ్గురు చిన్నారుల మృతి
మేఘాలయలోని వెస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుట్టగొడుగులు తిని ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. జైంతియా హిల్స్ ఎస్పీ చెంపాంగ్ సిర్టి తెలిపిన వివరాల ప్రకారం.. సెఫాయ్ గ్రామంలోని ఓ మూడు కుటుంబాల వారు పుట్టగొడుగులు తిన్నారు. ఈ క్రమంలోనే వారంతా అస్వస్థతకు గురయ్యారు. అనంతరం వీరిని చికిత్స నిమిత్తం జోవాయిలోని ప్రభుత్వ ఎంసీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్