ఆర్థోపెడిక్, నరాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బాధితులు త్వరగా కోటుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పక్షవాతం, అంగవైకల్యం, దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఫిజియెథెరపీ దూరం చేస్తుంది. కీళ్ల సమస్యలు, కీళ్లు అరగటం, పక్షవాతం, పోలియో, కీళ్లవాపు వల్ల వచ్చే నొప్పులను తగ్గించటానికి, ఎముకలు విరిగాక వచ్చే వివిధ సమస్యల నివారణకు ఉపయోగ పడుతుంది. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స తర్వాత తిరిగి పూర్వ స్థితికి రావటానికి ఫిజియోథెరపీ ఆసరాగా ఉంటుంది.