లాస్ ఏంజెలిస్లో ఏర్పడిన కార్చిచ్చు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. వేలాది మంది ప్రజలు, మూగజీవులు నిరాశ్రయులయ్యేలా చేసింది. ఇలాంటి సమయంలోనూ ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో చాలా చోట్ల దోపిడీలు జరుగుతున్నాయి. అలాగే కొన్నిచోట్ల మూగజీవాలను కాపాడేందుకు కొందరు ప్రాణాలను సైతం లెక్కచేయట్లేదు. కుందేలు పిల్లను మంటల నుంచి బయటకు తీసుకొచ్చి యువకుడు కాపాడిన వీడియో వైరలవుతోంది.