నివాళులు అర్పించిన నాయకులు

50చూసినవారు
నివాళులు అర్పించిన నాయకులు
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం కొడంగల్ చౌరస్తా వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరంగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బసిరెడ్డి, మహేందర్, శ్రీశైలం, రమేష్ , మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్