వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల ఘటనలో ఏ-2 నిందితుడు సురేష్ రాజ్ రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. సోమవారం రెండు రోజుల పోలీసు కస్టడీకి మెజిస్ట్రేట్ అనుమతించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ రాజ్ సంగారెడ్డి జైలులో జుడీషియల్ రిమాండులో ఉన్నాడు.