వికారాబాద్
లగచర్ల ఘటన.. మరో 8 మంది అరెస్ట్
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల దాడి ఘటనలో మరో 8 మంది అరెస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇప్పటికే పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై అడిషనల్ ఐజి మహేష్ భగవత్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు.