'మహా' ప్రచారం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామన్నారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో తెలంగాణలో పాలన చేస్తున్నామని చెప్పారు.